999..
వేదాంతపు కడలి కదా నీ
తలపే ఓ సఖియా..!
జాబిలింటి
మధువు కదా నీ సొగసే ఓ సఖియా..!
మైమరపును మరపించిన నవ్వు నీది
మరువజాల..
మరుల
సిరుల వాడ కదా..నీ ఊసే ఓ సఖియా..!
నీ పెదవుల ముద్దాడే పదవిగాక
వేరెందుకు..
ఎదవీణియ
ధార కదా..నీ వలపే ఓ సఖియా..!
ఈ రాతిరి మందారం..మౌనమేల
పూనిందో..
శిలల
కలల పాట కదా..నీ చూపే ఓ సఖియా..!
అలల పాద
ముద్రలలో..సుతిమెత్తని నీ కురులే..
చెలిమిపూల
తేనె కదా..నీ ధ్యాసే ఓ సఖియా..!
గజల్ వనం చూపినావు మాధవునకు
విశ్రమింప..

No comments:
Post a Comment