పరుగులిడే లేగదూడ
https://drive.google.com/file/d/0B9J45GfRMpUXQ184bjVjV0FXZU0/view?usp=drive_web

పరుగులిడే లేగదూడ..వెన్ను ఎవరు తట్టాలాట..!?
పరవశించు సెలయేటికి..మిన్ను ఎవరు చూపాలట..?!

నీరసాన్ని పోగేసుకు..తిట్టుకునే వెందుకలా..?!
అక్షరమౌ గుండెలయకు..చెన్ను ఎవరు దిద్దాలట..?!

సరసరాగ వీణియగా..ఉన్న మనసు మౌనమేమి..?!
పలుకలేని రాగాలకు..పెన్ను ఎవరు ఇవ్వాలట..?!

పాలలోని వెన్న లాగ బ్రతుకు సాగి పోయేందుకు..
కవ్వమల్లె కదలాడగ..నిన్ను ఎవరు చుట్టాలట..!

గగనమంటు స్వప్నాలను కంటూ మరి లేవకుంటె..
తెరచుకోని నీ తియ్యని కన్ను ఎవరు విప్పాలట..!?

'మాధవు'డే నీ మదియను..రాధమ్మను ఏలువాడు..
అజ్ఞానపు నీ కర్మకు..పన్ను ఎవరు కట్టాలట..?!

No comments:
Post a Comment